కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో SIR (ఓటరు సవరణ ప్రక్రియ) పరిశీలించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి .
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న SIR (ఓటరు సవరణ ప్రక్రియ) లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతినగర్ డివిజన్ (276),దుండిగల్ డివిజన్ (296) మరియు నిజాంపేట్ డివిజన్(273) లో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్ డెస్క్ లను సందర్శించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ SIR ప్రక్రియలో భాగంగా BLO లు మరియు BLA లు ఇంటింటికీ వెళ్లి ఏనుమరేషన్ ఫార్మ్స్ అందచేసి తిరిగి వాటిలో ఉన్న వివరాలు పూర్తిస్థాయిలో నింపి తిరిగి సంబంధిత అధికారులకు అందచేయాలని తెలియచేసారు.
అదే విధంగా డివిజన్ అధ్యక్షులు మరిన్ని హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు లోపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రగతినగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి),దుండిగల్ డివిజన్ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, నిజాంపేట్ డివిజన్ అధ్యక్షులు కోటపాటి మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిరా మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
