చింతల్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ SIR ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా 282 డివిజన్ చింతల్ పరిధిలోని వివేకానంద నగర్ లో స్థానిక డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ బిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమానికి కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఓటర్లతో మాట్లాడుతూ SIR కార్యక్రమం ఉద్దేశ్యం, ఓటరు వివరాల మ్యాపింగ్ ప్రాముఖ్యత, ప్రతి అర్హుడైన ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. అలాగే, ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు SIR కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు) తోపాటు కూన రాఘవేంద్ర గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు పృద్వి, అరుణ్, రాజేష్,సాయికుమార్,పుండరీక,జగన్ గౌడ్ నవీన్,సరిత నరసింహ, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
