ప్రతి జర్నలిస్టు బీమా సౌకర్యం కలిగి ఉండాలి
టీఎస్ జేఏ జర్నలిస్టులకు రెండు లక్షల ప్రమాద బీమా బాండ్లను అందించి రాష్ట్ర అధ్యక్షులు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : మీడియా రంగంలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టు బీమా సౌకర్యం కలిగి ఉండాలని ప్రతి జర్నలిస్టు వారి కుటుంబాలకు ఆర్థికపరమైన భరోసా కల్పించే విధంగా నడుచుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో (టీఎస్ జేఏ) అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ లో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండు లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్లను అందించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు దుస్సా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి జిల్లాల నాయకులు జిల్లా నాయకులు మండలాల పట్టణాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
