SAKSHITHA NEWS

సాగు, త్రాగు నీటి సమస్యలపై రాఘవరెడ్డి కృషి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

ప్రజల పక్షపాతి అమరజీవి నర్రా రాఘవ రెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం నాడు రాఘవ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ నకిరేకల్ యం యల్ ఏ గా ఆరు పర్యాయాలు గెలుపొందిన నర్రా రాఘవ రెడ్డి నల్లగొండ జిల్లా సాగు,త్రాగునీరు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని చెప్పారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని గీత, గ్రామ సేవకుల,రైతు, వ్యవసాయ కార్మిక వంటి పలు చేతి వృత్తి దారుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేశారని కొనియాడారు.

రాఘవ రెడ్డి ఆశయ సాధన కొరకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుఅవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, సిపిఎం రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, ఐతరాజు నర్సింహ, మేడి సుగుణమ్మ, మెట్టు నర్సింహ, గుడిసె లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ బూరుగు క్రిష్ణ వేణి, చింతపల్లి క్రిష్ణయ్య, నర్రా బిక్షం రెడ్డి, కొంపెల్లి రమేష్, సిరిఫంగి యాదయ్య, పర్నె లక్ష్మమ్మ, బూర్గు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS