ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం పసుపుమయం
ఐదవ వార్డ్ క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు,డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీలో చేరిక
కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ నేతలు లావు,డా౹౹చదలవాడ
అరవింద బాబు అందరికీ అందుబాటులో ఉంటారు
పల్నాడు ప్రజల సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో పోరాడుతా
అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందాం
వైసీపీ ఉగ్రవాదం నుంచి బయటికి రండి తెలుగుదేశం పార్టీలో చేరి జనజీవన స్రవంతిలో కలవండి
నరసరావుపేట పట్టణంలో స్థానిక ఐదవ వార్డ్ క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు,డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో మంద మార్క్,మల్లవరపు బాబు,జిర్రా శాంతి కుమార్ ఆధ్వర్యంలో 120 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారికి లావు శ్రీకృష్ణదేవరాయలు,డా౹౹చదలవాడ అరవింద బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చేరికలతో ఐదవ వార్డు క్రిస్టియన్ పాలెం పసుపు మయంగా మారింది.ఎంపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ……..డా౹౹చదలవాడ అరవింద బాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.తాను ఎంపీగా గెలిస్తే ఉంటే నరసరావుపేటలో ఉంటానని లేకపోతే పల్నాడు ప్రజల సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో ఉంటానన్నారు.
తనను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి కలవవచ్చునని తను సామాన్యుడిగా ఉంటూ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ……ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం తెలుగుదేశం పార్టీకి గుండెకాయలా మారిందన్నారు.వైసీపీ దుష్ట రాజకీయాలను ఓడించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు.వైసీపీ ఉగ్రవాదం నుంచి వైసీపీలోని విభీషణులంతా బయటికి రావాలని తెలుగుదేశం పార్టీలో చేరి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.వైసీపీ అవినీతి,అక్రమాలకు వ్యతిరేకంగా మీ అరవింద బాబు పోరాటం చేస్తున్నారని మీ అరవింద బాబుకు మద్దతు తెలిపి అవినీతి,అక్రమాలను తరిమికొట్టేందుకు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేములపల్లి నరసయ్య,వేల్పుల సింహాద్రి యాదవ్,కొట్ట కిరణ్,వాసిరెడ్డి రవి,జంగాల వెంకటేశ్వర్లు, దావల నాగేశ్వరరావు, రాజు,సుబ్బారావు,శేశీల్ మరియు వార్డ్,పట్టణ ముఖ్య నాయకులు,జనసేన,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.