SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీ లో గల నాల ను మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి , జోనల్ కమిషనర్ శ్రీ ఉపేందర్ రెడ్డి , డీసీలు మోహన్ రెడ్డి , ముకందా రెడ్డి , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పల పాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య కాలనీ మరియు
ఆదర్శ్ నగర్ కాలనీల ప్రాంత వాసుల విజ్ఞప్తి మెరుకు నాల విస్తరణ పనులు త్వలోనే చేపడుతామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని , మియాపూర్ పటేల్ చెరువు ఔట్ లెట్ నుండి మరియు STP ఔట్ లెట్ నీటి ప్రవాహం నాల నుండి వెళ్తుంది అని ప్రజలకు నాల పొంగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని , రాబోయే వర్షాకాలం లోపు నాల విస్తరణ పనులు చెప్పటి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

చెరువుల సుందరికరణ మరియు వాటి సంరక్షణ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, ప్రధానంగా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్‌ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులతో అనతికాలంలోనే చెరువుల రూపురేఖలు మార్చుకుని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు కృషి చేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE శంకర్ నాయక్ ,EE KVS రాజు, DE దుర్గ ప్రసాద్, AE సంతోష్ కుమార్ ఇరిగేషన్ DE నళిని, AE పావని మరియు కాలనీ వాసులు, నాయకులు ,కార్యకర్తలు, మహిళలు ,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS