SAKSHITHA NEWS

నాడు – నేడు పనులనూ వదిలి పెట్టని తోడేరు రెడ్డి

చిన్నబిడ్డలు చదువుకునే స్కూళ్ల పనుల్లోనూ దోపిడీ

తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్న ఘటనపై విచారణ జరిపిస్తా

మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో నాడు-నేడు పనులను పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నాడు –నేడు పథకంలో రూ.73 లక్షలతో పనులు చేసినట్లు ఆనాటి మంత్రి కాకాణి శిలాఫలకం వేసుకున్నాడు

ఇప్పుడు ఏ గదిలోకి వెళ్లినా పైకి చూస్తే శ్లాబు కమ్ములు బయటకు కనిపిస్తున్నాయి..పెచ్చులూడి పడుతున్నాయి

తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు…కనీసం ప్లాస్టరింగ్ చేయకుండా అతుకులు వేశారు

బాలికల ఉన్నత పాఠశాలలో 260 మంది విద్యార్థినులుంటే మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి

నాబార్డు ఫండ్ తో చేపట్టిన పనులు పూర్తి చేయకుండా మరుగుదొడ్ల నిర్మాణాలను పెండింగ్ పెట్టారు..

రూ.30 వేలు ఖర్చు పెడితే మరిన్ని మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు..ఆ నిధులు నేనే ఇచ్చి పనులు పూర్తి చేయిస్తాను

నాడు నేడు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తా..

చిన్న పిల్లలు చదువునే స్కూళ్ల విషయంలోనూ దోపిడీకి పాల్పడటం దుర్మార్గం


SAKSHITHA NEWS