పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
సాక్షిత : 132 – జీడిమెట్ల డివిజన్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ పెద్దమ్మతల్లి దేవాలయం నూతన కమిటీ సభ్యులు పెద్దమ్మ గుడి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి సహకరించాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత పదేళ్ల కాలంలో దేవాలయాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించడంతోపాటు కుత్బుల్లాపూర్ లోని పలు దేవాలయాలలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న పురోహితులకు దేవాలయాల అభివృద్ధికై ధూప, దీప నైవేద్యాల కార్యక్రమం ద్వారా నెల,నెల ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా పెద్దమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దమ్మ గుడి దేవాలయ నూతన కమిటీ సభ్యులు తలారి రాజు, సత్యనారాయణ, ఉప్పరి కృష్ణ, దొంతి మహేష్, కొరివి సత్యనారాయణ సత్యనారాయణ, సందబోయిన వెంకటేష్, పిట్ల శంకర్, కొరివి నవీన్ తదితరులు పాల్గొన్నారు.