సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ DSP
హైదరాబాద్:
మ్యూజిక్ మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు, టాప్ హీరోలతో ఆయన ఇప్పటికీ అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతు న్నాడు.
మొట్ట మొదటిసారిగా దేవిశ్రీప్రసాద్ ఒక లైవ్ కన్సర్ట్ హైదరాబాద్ లో నిర్వహించ బోతున్నాడు.ఈ నెల 19న ఈ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది.
ఈ వెంట్‌కు పలువురు ముఖ్య అతిథులు వస్తారని ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయన్నుఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దేవిశ్రీ ప్రసాద్.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్కలను మర్యాద పూర్వకంగా కలిశారు. 19న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యూజి కల్ లైవ్ షో కు హాజరు కావాలని కోరారు.
దేవిశ్రీ ప్రసాద్ వెంట బండ్ల గణేశ్ ఉన్నారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధిం చిన టికెట్లను ఇప్పటికే నిర్వాహకులు విక్రయించారు.