SAKSHITHA NEWS

ఆస్తి, ఖాళీ స్థలాల రాయితీ…మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీ హరిబాబు

చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిధిలో ఆస్తి పన్ను, స్థలాల పన్ను ఏకమొత్తంలో చెల్లించిన వారికి 50 శాతం వడ్డీమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీ హరిబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెం. 46 పన్నుల రాయితీ జీవోను విడుదల చేయటం జరిగిందన్నారు. పన్నుల విష యంలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలను, ఆర్థిక సంవత్సరం బకాయిలపై విధించిన వడ్డీని వన్ టైం సెటిల్మెంట్ గా మాఫీ చేయటం జరు గుతుందని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏకకాలంలో బకాయి చెల్లిస్తే 50 శాతం వడ్డీ మిన హాయింపు వర్తిస్తుందని తెలిపారు.