మోడల్ కాలనీలో పర్యటించిన : మున్సిపల్ కమిషనర్ నాగరాజు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలోని
మోడల్ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ మోడల్ కాలనీలో నీటి సమస్య తో పాటు పరిసరాల అవగాహన శుభ్రత, పరిశుభ్రత సంబంధించి వీధిలైట్లు సమస్యను పూర్తి చేస్తాం అని అన్నారు. డైలీ వచ్చే చెత్త బండిలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని అంటూ ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మోడల్ కాలనీలో గల పల్లె దవాఖానా తో పాటు అంగన్వాడి స్కూల్ ను సందర్శించి పలు సూచనలు ఇచ్చారు. చుట్టు ప్రాంగణంలో వాతావరణం శుభ్రంగా ఉండాలి శుభ్రత, పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని కూడా పెట్టాలని అన్నారు. అంగన్వాడి స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. అంటూనే పిల్లలకు పోషక ఆహారంతో పాటు మునగాకు ముఖ్యంగా వాడాలి దానితోపాటు ఆకుకూరలు కచ్చితంగా మెనూలో ఉండాలి గర్భిణీలకు, చిన్న పిల్లలకు మంచి మంచి కార్యక్రమాలతో పాటు ఆరోగ్య సలహాలు ఇవ్వాలి అన్నారు. మోడల్ కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిండా హరిబాబు, తగరం ముత్తయ్య, నార్లపాటి కాంతారావు, నార్లపాటి దివాకర్, లతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
