రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం నిర్వహించిన : ఉద్యాన కళాశాల విద్యార్థులు

Sakshitha news

రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం నిర్వహించిన : ఉద్యాన కళాశాల విద్యార్థులు

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం లోని నారంవారిగూడెం గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల మెజర్ల విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం వర్మికంపోస్టింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యాన పంటలలో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి ఎరువులను తయారు చేసుకునే విధానం మరియు వాటివల్ల వచ్చే లాభాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కృష్ణ నాయక్, వంశీ, నగేష్, ధర్మతేజ, సురేంద్రతో పాటు గ్రామసెక్రటరీ రమేష్ మరియు రైతులు పాల్గొన్నారు.