గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సివి రేణుక గుంటూరు నగర పాలక సమస్త పరిధిలోని SKVRN హై స్కూల్ మరియు ఎల్ఎంపి హైస్కూను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న ఎస్ఏ వన్ పరీక్షను పరిశీలించి విద్యార్థులకు పలు సూచన చేశారు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలసికట్టుగా శ్రమించి పదో తరగతి విద్యార్థులందరూ జిల్లాలో జిల్లాలో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని, దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకోవాలని, విద్యార్థులను A, B, C, D గ్రేడులుగా విభజించి C, D గ్రేడుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి మినిమం స్టడీ మెటీరియల్ ద్వారా శిక్షణ ఇవ్వాలని శ్రీమతి సీవీ రేణుక అన్నారు ఎల్ఎంపి పాఠశాలలో మధ్యాహ్న భోజనములో బల్లి పడిన దని పుకార్లు రావడంతో శ్రీమతి సి.వి రేణుక ప్రత్యక్షంగా పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నిర్వహణలో ఎటువంటి లోపం లేదని, పరిసరాలు కూడా చాలా చక్కగా ఉన్నాయని, పాఠశాలలోని అందరు విద్యార్థిని,విద్యార్థులను అడిగి విషయం తెలుసుకోవడం జరిగిందని ఎవరు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, బీసీ హాస్టల్ కి చెందిన ఒక విద్యార్థి గత వారం రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్న విషయాన్ని తమ దృష్టికి రావడంతో వెంటనే సంబంధిత హాస్టల్ అధికారులనుపిలిపించి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆదేశించటంజరిగిందనివారు అన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
