కమ్మెట మాజీ సర్పంచ్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సేవారత్న అవార్డు

Sakshitha news

కమ్మెట మాజీ సర్పంచ్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సేవారత్న అవార్డు

తాజా మాజీ సర్పంచ్ తలారి తులసీ రాజుకు ఉత్తమ సర్పంచ్ అవార్డు

శంకర్‌పల్లి: చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామానికి చెందిన పట్లోళ్ల హనుమంత్ రెడ్డి సర్పంచ్ గా అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధా క్రిష్ణ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు, ఎంపిక పత్రాన్ని అందుకున్నారు. డిసెంబర్ లో తిరుపతిలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 18 వ నేషనల్ కాన్ఫరెన్స్ లో సేవా రత్న జాతీయ అవార్డు అందుకుంటారు. గ్రామ అభివృద్ధికి చేసిన సేవకు ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కింది. ఈ మేరకు నల్లా రాధా కృష్ణ ఎంపిక పత్రాన్ని అందజేశారు. తనకు దక్కిన అవార్డును గ్రామానికి అంకితం చేస్తున్నట్లు అవార్డు గ్రహీత పట్లోళ్ల హన్మంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు గోనె. కరుణాకర్ రెడ్డి, సురేందర్ గౌడ్, బాలకృష్ణ, ఆంజనేయులు గౌడ్, రాంచెంద్రయ్య, రావులపల్లి వెంకటేష్, సంపత్ కుమార్ బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అవార్డుల కమిటీ సభ్యులు కడమంచి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top