విష జ్వరాలు రాకుండా కాలనీలల్లో దోమలకు ఫాగింగ్ చెయ్యాలి – ఎంపీడీఓ గుండె బాబు
కన్నూర్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ
ప్రజల ఆరోగ్యాలు, పరిశుభ్రత పై మెడికల్ సిబ్బంది తో సమీక్ష
సాక్షిత కమలాపూర్ :
ప్రభుత్వం ప్రవేశ పెట్టె పథకాల పై గాని లేక ఇతర పనుల కోసం గాని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది పై తనకు నేరుగా పిర్యాదు చెయ్యాలని ఆయన అన్నారు. కమలాపూర్ మండల పరిధిలోని కన్నూర్ గ్రామం లో పంచాయితీ సిబ్బంది పని తీరు పై ఆరా తీసి వారి యొక్క పని తీరును గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సీ కాలనిలో తిరిగి కాలువలను, కాలనీ పరిసరాలను పరిశీలించి కాలనీవాసులకు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అనంతరం పంచాయతీ కార్యదర్శికి కన్నూర్ లో ఉన్న ప్రతీ కాలనీ లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని గ్రామపంచాయతీ సిబ్బందితో దోమలకు ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. ఆశా వర్కర్లకు ఇంటింటికి ఫీవర్ సర్వే చేయాలని సూచించారు.మెడికల్ సిబ్బంది తో ఎంపీడీఓ షుగర్ పరీక్ష చేపించుకోగా నార్మల్ గా వచ్చిందని మెడికల్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం లోఎంపీఓ రవి ఏపీఓ రమేష్ బాబు, గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజు, హెల్త్ సూపర్ వైజర్ కనక లక్ష్మి ఏఎన్ఎం రజిత హెల్త్ అసిస్టెంట్ శివ శంకర్, గ్రామ ఆశా వర్కర్ లు ఇనుగాల కృష్ణవేణి, బొల్లారం మంజుల, ఆడికల సరిత తదితరులు పాల్గొన్నారు.