
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ను కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అందజేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్ ఫ్రమ్ ది సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ లో సభ్యుడిగా తనని నియమించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ధన్యవాదములు తెలిపారు.
