కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత నగర్ ఆటో స్టాండ్

Sakshitha news

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత నగర్ ఆటో స్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , తెరాస రాజు అధ్యవర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆమె చూపిన పోరాటస్ఫూర్తి నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆమె ఆత్మస్ఫూర్తిని స్మరించుకుంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కో ఆర్డినేటర్ వీరారెడ్డి, బ్రహ్మం, రాము యాదవ్, కళ్యాణ్ నాయక్, విష్ణు, జ్ఞానేశ్వర్, భద్రునాయక్, రాజు, విజయ్ గౌడ్, కృష్ణారావు, శంకర్, రామ్ రెడ్డి, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, పార్వతమ్మ, రేవతి, లక్ష్మి, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.