నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల లో..

Sakshitha news

నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల లో…
సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్, షి టీమ్స్, ఆత్మ రక్షణపై అవగహన*


సాక్షిత ప్రతినిధి నడిగూడెం సూర్యాపేట జిల్లా)
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో, మునగాల సర్కిల్ సీ ఐ రామకృష్ణ రెడ్డి సూచనల మేరకు కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ ఎస్ ఐ మల్లేష్ నడిగూడెం ఎస్ ఐ అజయ్ కుమార్ సహకారంతో మండల పరిధిలో గల తెలంగాణ రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందు పోలీస్ ప్రజా భరోసాకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.
ఇట్టి కార్యక్రమంలో సి ఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసు ఉందన్నారు..
మహిళలను గౌరవించాలి, మహిళా రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి, మహిళలను, పిల్లలను వేదిస్తే షీ టీం నెంబరు 8712686056 కి ఫిర్యాదు చేయవచ్చు కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుంది. మహిళల, విద్యార్థులు రక్షణ చట్టాలు, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి, లక్ష్యం కోసం కృషి చేయాలని తెలిపినారు. యువత ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, పాస్ పోర్ట్, విసా పొందే విషయంలో పోలీసు అనుమతులు ఇవ్వబడవు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది
ఉచిత భాహుమతులు, తక్కువ రేటుకు వస్తువులు వస్తాయి, లాటరీ వచ్చినది, తక్కువ వడ్డీ లోన్ లు ఇస్తాము, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తాము, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది ఇలాంటివి ఎవరైనా అపరిచితులు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకోవద్దు.
బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టవద్దు, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు. అశ్లీలపు వీడియో కాల్స్ మాట్లడి ప్రాణలమీదకు తెచ్చుకోవద్దన్నారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపవద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు. గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు, డ్రగ్స్ కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పేకాట, బెట్టింగ్ లాంటి, బహిరంగంగా మద్యం తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు. వీటిపై పోలీసుకు సమాచారం ఇవ్వాలి. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు.
కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ ఎస్ ఐ మల్లేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళ రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని, విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి, అధికారుల దృష్టి తేవాలని, మానసిక దైర్యం కలిగి ఉండాలని, అనుకూల, ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు. తల్లిదండ్రుల కోరికలను, కళలను నెరవేర్చాల్సి బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురు కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కొరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వాణి , షి టీం మహిళ హెడ్ కానిస్టేబుల్ కవిత,సాయిజ్యోతి, కానిస్టేబుల్ నాగేంద్ర బాబు, నడిగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది నరేష్ మరియు జానీ పాషా, ఉపాధ్యాయనిలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.