పేట శానిటేషన్ డివిజన్-1 లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్.

Sakshitha news

పేట శానిటేషన్ డివిజన్-1 లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్.

సాక్షిత :చిలకలూరిపేట పట్టణంలోని డివిజన్ వన్ పరిధిలో శానిటేషన్ సేవల నాణ్యతను పరిశీలించేందుకు ఉదయం మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం వేళల్లోనే కమిషనర్ స్వయంగా శానిటేషన్ డివిజన్‌కు సంబంధించి వాహనాలు,బండ్లు పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు శానిటేషన్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తుచేశారు.వాహనాల సకాలంలో తరలింపు, సిబ్బందికీ విధినిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ పరిశీలనలో కొన్ని బండ్లు సక్రమంగా లేవని గుర్తించిన కమిషనర్,వాటిని వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. పారిశుద్ధ కార్మికుల రోజు వారు అటెండెన్స్ ను పరిశీలించారు.దీనికి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావుకి పలు సూచనలు జారీ చేశారు.అలాగే శుభ్రత నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రతీసారి నాణ్యమైన శానిటేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ 1 సానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.