SAKSHITHA NEWS

ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ….

ఈ రోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప సిద్ది బ్లాక్స్ వద్ద వరహి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ హాజరై అమ్మవారికి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సాంబాశివా రెడ్డి, మహిళా నాయకురాలు స్వర్ణ కుమారి, పద్మ ఆర్ఎంపీ డాక్టర్, వరాహి యూత్ అసోసియేషన్ సభ్యులు కార్తీక్,తేజ, రాధాకృష్ణ, రహీం,రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS