SAKSHITHA NEWS

భారత దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇటీవల తన ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో తన మార్క్ చాటుకుంటున్న రిలయన్స్ శీతల పానియాల విభాగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో శీతల పానియాల విభాగంలో కాంపా కోలా, సోస్యో లాంటి బ్రాండ్స్ ని తీసుకువచ్చిన రిలయన్స్.. ఇడప్పుడు మరిన్ని డ్రింగ్స్ ని మార్కెట్ లోకి తీసుకు వచ్చేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తుంది. కొత్త బ్రాండ్ కూల్ డ్రింగ్స్ ని దేశీయంగా ఇంట్రడ్యూస్ చేయనుంది. వివరాల్లోకి వెళితే..

రిలయన్స్ కొత్త శీతల పానియాలు దేశీయ మార్కెట్ కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.. దీంతో కోకా-కోలా, పెప్సీకి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలిఫ్యాంట్ హౌస్ బ్రాండ్స్ పై దేశీయంగా కూల్ డ్రింక్స్ తయారీ, విక్రయాలు చేపట్టేందుకు రిలయన్స్ సంస్థ శ్రీలంక ఎలిఫ్యాంట్ హౌజ్ కు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గతంలో కోంపా కోలా, సోస్యో వంటి బ్రాండ్లను తీసుకువచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరిన్ని కూల్ డింక్స్ ను జోడించనుంది. దీని వల్ల దేశీయంగా రిలయన్స్ వేవరేజ్ ఉత్పత్తులు పోర్ట్ ఫోలియో ను విస్తరించడమే కాకుండా.. కొత్త ఉత్పత్తులను భారతీయ కస్టమర్స్ కి అందించడానికి వీలవుతుందని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

గత కొంత కాలంగా రిలయన్స్ ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగానే దేశీయంగా మరింత పాపులారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో పాపులర్ బ్రాండ్లను కొనుగోలు చేస్తూ వస్తుంది. కాంపా, సోస్యో హుజూరీ లాంటి కూల్ డ్రింక్స్ తో పాటుగా లోటస్ చాక్లట్స్, శ్రీలంకకు చెందిన మాలిబన్ బిస్కెట్స్ బ్రాండ్స్ ను సైతం కొనుగోలు చేసింది. తాజాగా ఎలిఫ్యాంట్ బ్రాండ్ ని దేశియంగా మార్కెంట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంకకు చెందిన సిలోన్ కోల్డ్ స్టోర్స్ లో ఎలిఫ్యాంట్ హౌస్ బ్రాండ్ నిర్వహిస్తుంది. ఇది నెక్టో, క్రీమ్ సోడా, ఆరెంజ్ బార్లీ, లెమనేడ్, ఈజీబి పేరుతో పలు కూల్ డ్రింక్స్ విక్రయిస్తుంది. కాగా, ఈ ఒప్పందం ద్వారా ఇదే ఫ్లేవర్లు మన భారత దేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

WhatsApp Image 2024 02 29 at 1.00.49 PM

SAKSHITHA NEWS