SAKSHITHA NEWS

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ సభ్యులకు డప్పులు బహుకరణ

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు వారి అమ్మమ్మ గ్రామమైన చివేముల మండలం బండమీద చందుపట్ల ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అభ్యర్థన మేరకు సుమారు 12 వేల రూపాయలు వెచ్చించి 10 డప్పులను కీ”శే” యాతాకుల శ్రీరాములు జ్ఞాపకార్థం గ్రామ ఎమ్మార్పీఎస్ శాఖకు అందజేయడం జరిగింది. ఇట్టి బహుకరణ కార్యక్రమం ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఎర్ర.వీరస్వామి ఆధ్వర్యంలో, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు యాతాకుల రఘు మాదిగకు డప్పులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాష పంగు బుచ్చిబాబు మాదిగ, ఎర్ర నారాయణ మాదిగ, గుద్దేటి పెద్ద వెంకన్న మాదిగ, బొడుపుల హరికృష్ణ మాదిగ, గుద్దేటి చిన్న వెంకన్న మాదిగ, కోడి సుధాకర్ మాదిగ, యాతాకుల రాజు మాదిగ, కోడి వీరస్వామి మాదిగ, కోడి రవి మాదిగ, ఎర్ర గోపి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app