ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు జన్మదిన వేడుకలు నిర్వహించిన డిప్యూటీ మేయర్
తెలంగాణ ఉద్యమకారుడు, జనం మెచ్చిన నాయకుడు, జన హృదయ నేత ప్రియతమ నాయకుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు జన్మదిన సందర్బంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,లావణ్య మెడికల్ స్టోర్ ప్రోపరేటర్ ఏ. రమేష్, తో కలిసి డిజైర్ సొసైటీ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసి చిన్న పిల్లలు సమక్షంలో కట్ చేసి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం నాయకులు కుమార్ రెడ్డి, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, రాజు అన్న అభిమానులు శేఖర్, వినయ్, వెంకటేష్, గణేష్, నరేష్, వసంత్, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.