SAKSHITHA NEWS

ఈనెల 4వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటి శంభీపూర్ కార్యాలయంలో దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మనోజా సుధాకర్ రూపొందించిన నూతన పాటను మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోజ సుధాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS