SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా వైద్య అధికారులతో ఎమ్మెల్యే నివాసం లో జగిత్యాల నియోజకవర్గ వైద్య సేవలు,పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .

జగిత్యాల నియోజకవర్గంలో 33 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, 20 ఆరోగ్య ఉప కేంద్రలకు భవనాలకు నిదులు కూడా మంజూరు కాగా భవన నిర్మాణాలు త్వరిత గతినచేపట్టాలని,పంచాయతీ అధికారులతో ఫోన్ లో మాట్లాడి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను అందుబాటులోకి తీసుకురావడం లో చొరవ తీసుకోవాలని అన్నారు.రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సైతం ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని జిల్లా వైద్య అధికారులతో సమీక్షలో తెలిపారు.జగిత్యాల నియోజకవర్గం లో పేదలకు నాన్యమైన వైద్య సేవలు అందించడం ప్రజా ప్రతినిదులు అధికారుల భాధ్యత అని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో DMHO సమీయొద్దిన్,జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్,వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS