తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు…
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి, బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందడం జరిగినది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రo, గద్వాల నియోజకవర్గంలోని ప్రజలు, రైతాంగం దినదిన అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా శ్రీవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు.