రంగారెడ్డి జిల్లా చేవెళ్ల
పెట్రోల్ బంకుల యాజమాన్యానికి ఎమ్మెల్యే హెచ్చరిక టు వీలర్ పై వచ్చిన వారికి ఎలిమెంట్ ఉంటేనే పెట్రోల్ పోయండి.
రోడ్డుపైకి నో హెల్మెంట్ నో ఎంట్రీ
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య …
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫ్యూచర్ సిటీ శంకర్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శంకర్ పల్లి వాహనదారులకు ఎమ్మెల్యే పోలీసులకు 100 హెల్మెట్లను అందజేస్తా అని చెప్పారు..
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్క మానవుడు పాటించాల్సిందే ముఖ్యంగా వాహనాలు ఇవ్వడం నేరమని చెప్పారు. 18 సంవత్సరాల నిండిన తర్వాత లైసెన్స్ తెచ్చుకొని రోడ్డుపైన వాహనం నడపాలని హెచ్చరించారు.
పోలీస్ రూల్స్ కు ఎవరు కూడా వ్యతిరేకించకుండా వారికి సహకరించి ట్రాఫిక్కు నిబంధనలను పాటించాలని కోరారు.
అనంతరం రైతులతో మాట్లాడి ఉల్లి ధర గిట్టుబాటు ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
రైతులకు శంకర్పల్లి మార్కెట్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
