చిట్యాల చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడికి ఎమ్మెల్యే అభినందనలు
సాక్షిత న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గంజి సుధాకర్ ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ సభ్యులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టాలని గంజి సుధాకర్ కు సూచించారు. చేనేత రంగ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా చేనేత రంగానికి అవసరమైన సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన గంజి సుధాకర్ విజయవంతంగా పనిచేసి చిట్యాల చేనేత సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
