దుండిగల్‌లో ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

దుండిగల్‌లో ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ డివిజన్‌లో కొనసాగుతున్న SIR (ఓటరు సవరణ ప్రక్రియ) కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓటరు సవరణ ప్రక్రియలో పాల్గొని, బూత్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటరు సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల సమస్యలు, అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, 296 దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ రావు గౌడ్, బొట్ల విజయకుమార్, మహేందర్ యాదవ్, కావలి శశి కుమార్, పీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆకుల ప్రేమ్ కుమార్, బాబు, చిన్న ముత్యం రెడ్డి, మధు, జక్కుల కృష్ణ, సిరిగల బాబు, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top