గణపతి నవరాత్రుల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సన్మానిస్తున్న నిర్వాహకులు
సాక్షిత :గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 28& 11వ డివిజన్ లో ( బజరంగ్ యూత్ సభ్యలు & టీమ్ మహాభల్ యూత్ సభ్యలు) వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , నాయకులు మేకల మధుసూదన్ వారు ప్రత్యేక పూజతో పాటుగా అన్నప్రసాధన వితరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ సభ్యలు & టీమ్ మహాభల్ యూత్ సభ్యలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
