అధినాయకుడు ఆశయాలను… కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో నా వంతు కృషి చేస్తున్నా: ఎమ్మెల్యే పులివర్తి నాని

Sakshitha news

అధినాయకుడు ఆశయాలను… కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో నా వంతు కృషి చేస్తున్నా: ఎమ్మెల్యే పులివర్తి నాని .

చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం.

అందులో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నా : ఎమ్మెల్యే .

చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా.

నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి…… వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే .

గత 5 సంవత్సరాల వైసిపి పాలనలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు.

నియోజకవర్గ వ్యాప్తంగా గత వైసీపీ నాయకుల దౌర్జన్యంతో భూ సమస్యలు చాలానే సృష్టించారు…. ఇప్పుడు ఆ సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా రీ సర్వే చేపట్టి భూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే నియోజకవర్గంలో చాలా సమస్యలను పరిష్కరించాం.

చంద్రగిరి నియోజవర్గాన్ని సమస్యల రహిత నియోజవర్గంగా తీర్చడమే ప్రథమ బాధ్యత అని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.

తిరుపతి,

తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి….. సమస్యను విన్న ఎమ్మెల్యే . ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, హౌసింగ్, పెన్షన్ వంటి సమస్యలు వస్తున్నాయి . ఆ వినతి పత్రాలను ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు అందజేసి సమస్యలను త్వరితగతులు పరిష్కరించాలని ఆదేశిస్తానని తెలిపిన ఎమ్మెల్యే . చంద్రగిరి నియోజకవర్గంలో చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. గత వైసిపి పాలనలో వైసిపి నాయకులు భూ సమస్యలను చాలానే సృష్టించారు. ఇప్పటికే వాటిలో కొన్ని సమస్యలను తీర్చగలిగాము మరికొన్ని ఆస్తి తగాదాలు, కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం అవుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజలు ,కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.