లడ్డూ వివాదంపై చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

Sakshitha news

లడ్డూ వివాదంపై చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూలో కల్తీ ఉందంటూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించిన వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అన్యాయమైన దుష్ప్రచారం చేశారని, దీంతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. కల్తీ నెయ్యి ట్యాంకర్లు కూడా ఆయన హయాంలోనే వాడారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Scroll to Top