పెద్దపల్లి: బావిలో దూకి మహిళ సూసైడ్
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన గుండ లలిత(45) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. గత మూడేళ్లుగా షుగర్, లివర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందుతున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
