విద్యార్థినులకు ఏకరూప దుస్తులు అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
లంకా లితీష్ జన్మదినం సందర్భంగా దుస్తులు వితరణ.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మైలవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (గర్ల్స్ హైస్కూలు)లో 40 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పంపిణీ చేశారు. మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు శ్రీలంకా లితీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన సౌజన్యంతో దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం కూడా ముఖ్యమన్నారు. సెల్ ఫోన్లను విజ్ఞానం కోసం మాత్రమే ఉపయోగించాలన్నారు. చదువులో బాగా రాణిస్తే ఉజ్వల భవిత ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు దాతల వితరణను సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టిన లంకా లితీష్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తివంతంగా నిలిచాయన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.