మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే KR నాగరాజు పరామర్శ…
వర్ధన్నపేట మండల ఇల్లందు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సట్ల యాదగిరి గౌడ్ గుండెపోటుతో మరణించగా వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యాదగిరి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వర్ధన్నపేట పట్టణానికి చెందిన దండు కుమారస్వామి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి,తన వంతుగా బియ్యంతో పాటు వంట సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, ఇల్లంద మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, పిఏసిఎస్ చైర్మెన్ రాజేష్ ఖన్నా,ఐనవోలు దేవస్థానం చైర్మెన్ ప్రభాకర్ గౌడ్,వర్ధన్నపేట మండల అధ్యక్షులు పోశాల వెంకన్న,మాజీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ,కౌన్సిలర్లు, సర్పంచులు,నియోజకవర్గ,మండల,గ్రామ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
