SAKSHITHA NEWS

UNIVERSAL యూనివర్సల్ హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ …

సాక్షిత : 132- జీడిమెట్ల డివిజన్ రాఘవేంద్ర కాలనీలో నిర్వాహకులు వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ నేటి రోజుల్లో వస్త్ర వ్యాపారం ఎంతో ఆదరణ పొందుతుందని నూతన వస్త్రాలు ఆకట్టుకునే డిజైన్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంచితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకులు కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, శ్రీకాంత్, కాలే గణేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కనకయ్య, ప్రవీణ్ రెడ్డి, ఉమాపతి, నరసింహారెడ్డి, బి. శ్రీనివాస్, హర్ష, సుబ్బారావు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

UNIVERSAL

SAKSHITHA NEWS