కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ పుట్టిన రోజు సందర్భంగా జగద్గిరిగుట్ట లోని వారి నివాసంలో నిర్వహించిన వేడుకలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కార్పొరేటర్ జగన్ కు శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వార్డ్ మెంబర్ ఇందిరాగౌడ్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో కండువా కప్పిన ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.