SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో గాయపడిన మహిళ కానిస్టేబుల్ సునీత ను చీరాల ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గాయపడిన మహిళ పోలీస్ సునీతకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆయన సూచించారు, గాయపడిన మహిళకు ధైర్యం చెప్పారు. చీరాల నియోజకవర్గంలో ఇటువంటి గొడవలను పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరి వెంట స్థానిక నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….