
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారం డివిజన్ గాజుల రామారం గ్రామం నందు షాపూర్ నగర్ మరియు గాజుల రామారం ఆర్యవైశ్య సంఘంల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయతో ప్రజలంతా అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్,చెట్ల వెంకటేష్, చిన్న చౌదరి, చందు సుంకరి, వహీద్, వెంకటేష్, బద్రి, నారాయణ, గౌస్, ప్రసాద్, గాజులరామారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు పవన్ గుప్తా,శేకర్, ప్రభాకర్,జగదీష్, సంతోష్, హర్ష,సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app