
డి.ఎస్.టెక్నాలజీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ గారు….
132 – జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ లో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన డి.ఎస్.టెక్నాలజీస్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. నిరుద్యోగ యువతకు ఉద్యోగకల్పనలో భాగంగా ఏర్పాటుచేసిన డి.ఎస్.టెక్నాలజీస్ రానున్న రోజుల్లో మరింత మంది యువతకు ఉపాధిని కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్ది, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, అడ్వకేట్ అద్దంకి వెంకటా చారి, దూదిమెట్ల క్రిష్ణ యాదవ్, నాయకులు అనిల్, కాలే నగేష్, గణేష్, నగేష్, కుంటి మల్లేష్, మల్లేష్, ఐటీ శ్రీనివాస్, ప్రసాద్, డిఎస్. టెక్నాలజీస్ అడ్మిన్ ఇంచార్జ్ దూదిమెట్ల నీరజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app