
సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె.
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
మౌలిక వసతులకు పదిలక్షల ఇరవైఐదు వేలు కేటాయింపు
చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. విద్యార్థులతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలకు కేటాయించిన అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులు 10 లక్షల 25 వేలతో పూర్తిచేసిన మంచినీటి సౌకర్యం,విద్యుత్ సౌకర్యం,మరుగుదొడ్లు,మైనర్ రిపేర్స్ తదితర మౌలిక వసతులను ప్రారంభించారు.
అదే గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద సానికి భీరయ్య జ్ఞాపకార్ధం వారి కుటుంబసభ్యులు నిర్మించిన మినీ మంచినీటి ట్యాంక్ ను ప్రారంబించి భీరయ్య కుటుంబ సభ్యులను అభినందించారు.
