
అన్నపురెడ్డిపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె
సాక్షిత
అశ్వరావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం
అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి తొట్టిపంపు పెంట్లం రంగాపురం గ్రామాలలో ఎస్ సీ సబ్ ప్లాన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులకు శంఖుస్థాపనలు చేసి
నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ
అనంతరం పెంట్లం గ్రామంలో బీరప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాలలో జరుగుతున్న వివాహ వేడుకలలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు…
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
