
ఆటల పోటీల ముగింపు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
సాక్షిత అశ్వరావుపేట మండలం:
భద్రాద్రి కొత్తగూడెం.
దమ్మపేట మండలం నెమలిపేట క్రీడామైదానం
లో దమ్మపేట క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపెద్దల సహకారంతో నిర్వహించిన డీపీఎల్ సీజన్ 4 మరియు గుర్వాయిగూడెం గ్రామంలో కీసరి రాంబాబు మెమోరియల్ క్రీడామైదానంలో జమేదార్ బంజర గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జమేదార్ బంజర గుర్వాయిగూడెం గోపాలపురం యువకుల సహకారంతో నిర్వహించిన అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన పెద్దగొల్లగూడెం గండుగులపల్లి జీలుగుమిల్లి నారంవారిగూడెం జట్లకు అలాగే వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ఆసుపాక కేశప్పగూడెం పెద్దగొల్లగూడెం జమేదార్ బంజర అంకంపాలెం జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు…
క్రీడా స్ఫూర్తిని వెలికితీయడానికి కృషి చేసి విజయవంతంగా టోర్నమెంట్ లు నిర్వహించిన దమ్మపేట క్రికెట్ కమిటీకి జమేదార్ బంజర గ్రామపంచాయతీ యువతకు ప్రత్యేక అభినందనలు
ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసంతో పాటు స్నేహాభావం పెంపొందుతుంది
ఆటలతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి విద్యతోనే ఏదయినా సాధించగలం
డ్రగ్స్ మత్తుపదార్ధాలు గంజాయి మధ్యపానం లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు
చెడువ్యసనాల వల్ల మన జీవితాలు మన కుటుంబాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించటం కొరకు రాజీవ్ యువ వికాస్ పథకం ప్రవేశపెట్టింది 60 నుంచి 80 శాతం రాయితీతో మూడునుంచి ఐదులక్షల ఋణసహాయం చేస్తుంది అర్హత కలిగిన sc st bc మైనారిటీ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి
క్రీడలలో రాణించే యువతను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడానికి రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి 25 ఎకరాలలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించా
అశ్వారావుపేట నియోజకవర్గకేంద్రంలో ఇండోర్ స్టేడియం త్వరలో నిర్మిస్తున్నాం క్రీడాకారులు వినియోగించుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
ముఖ్యంగా చదువుకునే ప్రతిఒక్కరికీ నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్ధిక భారం తో చదువులు మధ్యలో ఆపొద్దు ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమైన కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం
