అన్నపురెడ్డిపల్లి : కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జారే
సాక్షిత : తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గడిచిన కాలంలో ఏ ఒక్క అర్హుడికైనా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజంగా అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం చేస్తూ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ మరియు పలు శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
