నూతన మునిసిపల్ కమిషనర్ ను కలిసిన శాలువా తో సత్కరించిన సిపిఐ నాయకులు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మున్సిపాలిటీగా అవతరించిన తరుణంలో నూతన మున్సిపల్ కమిషనర్ గా నాగరాజు నియమతులయ్యారు.వారిని సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అశ్వారావుపేట మున్సిపాలిటీకి ఆహ్వానం పలికారు. నూతన కమిషనర్ తో ప్రస్తుత అశ్వారావుపేట మున్సిపాలిటీ స్థితిగతులను వివరించడం జరిగింది, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన సదుపాయాల కల్పన గురించి వారికి వివరించడం జరిగింది. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా సమతుల్యంగా పనిచేయాలని కోరుతూ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం, సిపిఐ జిల్లా నాయకులు గన్నిన రామకృష్ణ, అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయకాంత్, సిపిఐ నాయకులు సయ్యద్ రజ్వీ, మహిళా సంఘం నాయకులు చీపుర్ల సత్యవతి,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గద్ద సూర్య కుమారి,షేక్ రసూల్ బి తదితరులు పాల్గొన్నారు.
