ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

Sakshitha news

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా సూర్యాపేట జర్నలిస్టులు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు అంతా ఏకతాటిపై ఉంటూ తమకు కావలసిన వాటిని సాధించు కోవాలని సూచించారు.

తమకి అవసరం అయిన వాటిని అందిపుచ్చుకొని ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు అందించటంలో కృషి సల్ఫాలని కోరారు.ప్రస్తుతం జర్నలిస్టులకు అత్యవసరంగా కావలసింది ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం అని, అందుకోసం అవకాశం వచ్చినప్పుడు తన వంతు సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ సమయంలో ఎమ్మెల్యేని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వజ్జే వీరయ్య, ప్రధాన కార్యదర్శి ఐతగాని రాంబాబు, కోశాధికారి తల్లాడ చందన్,సీనియర్ జర్నలిస్టు మిక్కిలినేని శ్రీనివాస్ రావు, బొజ్జ ఎడ్వర్డ్,బుక్క రాంబాబు, ఊటుకూరి రవీందర్,అమరగాని నాగేందర్,రెబ్బ విజయ్,ఉయ్యాల నర్సయ్య,పెనుగొండ మల్లిఖార్జున్, మామిడి శ్రావణ్,మామిడి శంకర్,కంచర్ల సురేందర్,అజయ్,జంపాల ఉపేందర్,తండ వెంకన్న,వెంకన్న తదితరులు ఉన్నారు.

Scroll to Top