అనారోగ్య బాధితుడికి ఎల్ ఓ సి (LOC) అందజేసిన ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి
వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన జెనిల సాయిబాబా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
ఈ క్రమంలో తమకు మెరుగైన వైద్య చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదంటూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ని తమకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు
అందుకు సానుకూలంగా
స్పందించిన ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి రూ. 2లక్షల, 50 వేల, రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించారు
మంజూరైన ఎల్ వో సి నీ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హైదరాబాద్ మాదాపూర్ లో గల తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు
ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
