ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరిన ……………జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ఇతర మరమ్మత్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని పనులను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ఇతర మరమ్మత్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని పనులను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరి కల్లా అన్ని జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన రిపేర్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.
అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు మనో ధైర్యాన్ని నింపడం కూడా మన బాధ్యత అని, అప్పుడప్పుడు విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని గుర్తు చేశారు. చిన్న చిన్న విషయాలకు విద్యార్థులకు కృంగిపోకుండా వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ పెంపొందించాలన్నారు. కేవలం పాఠాలే కాకుండా మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కూడా కీలకమని గుర్తు చేశారు.
అపార్ ఐడి జనరేషన్ విషయంలో కూడా వేగం పెంచాలని కలెక్టర్ ప్రిన్సిపల్స్ కి ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ విషయంలో కూడా ఫాలోఅప్ చేసి విద్యార్థులు కళాశాలలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక జిల్లాలో ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించే విధంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో డిఐఈఓ అంజయ్య, డీఈఓ అబ్దుల్ ఘని, డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.
