నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి
మహాత్మ జ్యోతిరావు పూలే
ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో మహాత్మ జ్యోతి రావు పూలే 197 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పులా మాల వేసి
నివాళులర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతి రావు పూలె విగ్రహానికి శంకుస్థాన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు.
మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని ఆయన కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారని స్పష్టం చేసారు. బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందనీ ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి, మున్సిపాలిటీ చైర్మన్, వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.