SAKSHITHA NEWS

కంటి వెలుగు దేశానికే ఆదర్శం – ఎమ్మెల్యే చిరుమర్తి

— ఉరుమడ్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని అన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్న సందర్భంగా సర్పంచ్, ఎంపిటిసి లని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, స్థానిక సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి పెద్ద బోయిన సత్తయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల ఐలయ్య, కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, వైద్యాధికారి గట్టు కిరణ్ కుమార్, కంటి వెలుగు వైద్యాధికారిణి స్రవంతి, సిహెచ్ వో చక్రవర్తి, ఎ ఎన్ ఎమ్ ఎం.పద్మ, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు,ఆశా వర్కర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS